AP News : వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఆశలు ఫలించేనా? వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?..

UPDATED 18th MAY 2022 WEDNESDAY 11:30 AM

Ex MLAs IN YCP : ఒకప్పుడు.. ఆ నాయకులు.. జిల్లా రాజకీయాలను శాసించారు. వాళ్లు ఎమ్మెల్యేలే అయినా.. జిల్లా మొత్తం చక్రం తిప్పారు. కానీ.. ఇప్పుడు పదవులు లేక.. రాజకీయం చేయలేక.. ఇక చేసేదేమీ లేక.. గోళ్లు గిల్లుకుంటూ.. ఇంట్లో కూర్చున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో.. అధికార పార్టీలో ఉన్న అరడజనుకు పైగా మాజీ ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లోనైనా.. తమకు న్యాయం చేస్తారా? ఇతర పదవులైనా ఇస్తారా? అన్న ఆశతో.. కళ్లలో వత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.

మళ్ల విజయప్రసాద్, దాడి వీరభద్రరావు, తైనాల విజయ్ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, పిన్నింటి వరలక్ష్మి, యస్.ఎ.రెహమాన్, పసుపులేటి బాలరాజు, చింతలపూడి వెంకట రామయ్య, పంచకర్ల రమేశ్ బాబు.. హు.. ఆయాసం వచ్చేస్తుంది. జస్ట్ పేర్లు చదవడమే ఇంత కష్టంగా ఫీలైతే.. ఏ పదవి లేకుండా.. ఏదో ఒక పదవి వస్తుందని ఆశ పెట్టుకొని.. ఏదీ దక్కక.. వచ్చే ఎన్నికల్లోనైనా.. ఏదైనా దక్కుతుందేమోనన్న ఆశతో.. ఇంకా వెయిట్ చేయడం కన్నా.. కష్టమైతే కాదు. ఎందుకంటే.. పవర్‌లో ఉంటేనే.. లీడర్‌కి వాల్యూ. అధికారం కోల్పోతే.. గౌరవంతో పాటు అన్నీ తగ్గిపోతాయ్. విశాఖ జిల్లాలో పదవుల కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యేల.. లిస్ట్ చదివితే.. ఇందాకటిలా ఉంటుంది. ఇందులో.. మాజీ మంత్రులు కూడా ఉన్నారు.ఇందాక చెప్పుకున్న లీడర్లందరికీ.. తమ తమ నియోజకవర్గాల్లో బలం, బలగం గట్టిగానే ఉంది. పైగా.. సామాజికవర్గాల పరంగానూ.. స్ట్రాంగ్ పవర్ ఉన్నోళ్లు. వీరిలో.. కొందరు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్లు ఆశించారు.

ఇంకొందరు.. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వాళ్లున్నారు. అప్పటి నుంచి.. ఏదో ఒక రోజు.. ఏదో ఒక పదవి రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. మరికొందరు.. వలసొచ్చిన నేతలు ఇతర పార్టీల నుంచి చేరాం కాబట్టి.. ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించకపోతారా అని ఆశగా ఎదురుచూశారు. కానీ.. అధిష్టానం కొందరికే న్యాయం చేసింది. దీంతో.. మిగతా వాళ్లు తమకెప్పుడు చాన్స్ వస్తుందోనని ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఈసారైనా తమకు టికెట్లు దక్కకపోతాయా అన్న ఆశల్లో తేలిపోతున్నారు.

గత ఎన్నికల్లో.. విశాఖ వెస్ట్ నుంచి ఓడిపోయిన మళ్ల విజయ్ ప్రసాద్‌ను.. ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమించింది ఏపీ ప్రభుత్వం. కానీ.. ఈ మధ్యే.. వైజాగ్ వెస్ట్ కో-ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో.. అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ విజయం కోసం పనిచేసింది దాడి వీరభద్రరావు కుటుంబం. దీంతో.. ఆయన కుమారుడు దాడి రత్నాకర్‌తు నామినేటెడ్ పోస్టును ఇచ్చింది అధిష్టానం. అయితే.. తనకే పదవీ వద్దని.. తన కుమారుడిని భవిష్యత్ గురించి ఆలోచించాలని.. అధిష్టానం పెద్దల దగ్గర చెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది.మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుది మరో కథ. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. తర్వాత జనసేనలోకి.. ఈ మధ్యే వైసీపీలో చేరారు. ఆయన కుమార్తెకు.. జెడ్పీ ఛైర్‌పర్సన్ పదవి ఇస్తారని.. పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవడంతో.. వచ్చే ఎన్నికల్లోనైనా తనకు న్యాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.

ఇక.. విశాఖ నార్త్ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్.. ఎన్నికల ముందు సడన్‌గా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. తర్వాత.. జగన్ సీఎం కాగానే మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. పార్టీతో ఉన్న అనుబంధంతో.. ఏదైనా పదవి రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.రెహమాన్ కూడా మైనార్టీల్లో తనకున్న బలాన్ని నమ్ముకొని.. ఏదో ఒక పదవి కోసం సీఎం జగన్ కరుణించకపోతారా అని ఎదురుచూస్తున్నారు.

విశాఖ సౌత్‌లో.. ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. ఆ ఈక్వేషన్ తనకు ప్లస్ అవుతుందని.. తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్.. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. అధిష్టానం కరుణిస్తుందా.. పక్కనబెడుతుందా.. అన్నది ఆసక్తిగా మారింది. చింతలపూడి వెంకట్రామయ్య కూడా.. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. పార్టీలోనో.. ప్రభుత్వంలోనో.. ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పోస్టును ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి విశాఖలోని.. చాలా మంది మాజీలంతా.. పదవుల కోసం నిరీక్షిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లోనైనా.. తమ ఆశలు ఫలిస్తాయా.. ఎదురుచూపులకు న్యాయం జరుగుతుందా.. అన్నది ఆసక్తిగా మారింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us