Annavaram: రత్నగిరిపై నూతన దంపతుల సందడి

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 06:00 AM

అన్నవరం (రెడ్ బీ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి శుక్రవారం నూతన దంపతులతో సందడిగా మారింది. గురువారం రాత్రి రత్నగిరిపై వివాహం చేసుకున్న జంటలతో పాటు వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు స్వామివారి వ్రతమాచరించుకోవడానికి విచ్చేశారు. దీనికితోడు దశమి పర్వదినం కావడంతో భక్తులతో రత్నగిరి పోటెత్తింది. స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండుగంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం భక్తులు వేచిఉండాల్సి వచ్చింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. శనివారం భీష్మఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి దర్శనార్ధం శుక్రవారం రాత్రికే స్వామివారి సన్నిధికి అధిక సం ఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఒకపక్క వివాహాలు ఉండడంతో ముందస్తు రిజర్వేషన్‌లతో సత్రం గదులు కేటాయింపులో సాధారణ భక్తులు వసతిసమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీష్మఏకాదశి సందర్భంగా ఒంటిగంట నుంచి వ్రతాలు, రెండుగంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించాలని ఈవో త్రినాథరావు ఆదే శాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నివిభాగాల అధికారులకు ప్రత్యేకవిధులు కేటాయించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us