ఆదిత్యలో అప్లైడ్ రోబోట్ కంట్రోల్ ఆన్ లైన్ కోర్సు ప్రారంభం

UPDATED 24th JANUARY 2019 THURSDAY 6:30 PM

గండేపల్లి: ఇండో యూరోపియన్ అనుసంధానంతో ఇండో యూరోపియన్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో అప్లైడ్ రోబోట్ కంట్రోల్ (ఎ.ఆర్.సి)1.ఓ ఆన్ లైన్ కోర్సును అధికారికంగా ప్రారంభించారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల నుంచి సుమారు 80 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ స్టార్కే ఆన్ లైన్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ,విద్యార్థులు ఈ కోర్సు ద్వారా మంచి సృజనాత్మకత పెంపొందించుకొని ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇండో-జర్మన్ నెట్ వర్క్ ద్వారా ఈ కోర్సును జర్మనీలో శిక్షణ పొందిన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, డాక్టర్ పి.ఎస్. రంజిత్, మెంటార్ ఎం. విశ్వేశ్వరరావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us