రోడ్డు ప్రమాదంలో ౩౦ మందికి గాయాలు

UPDATED 8TH MAY 2017 MONDAY 6:00 AM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం - రాజమహేంద్రవరం ఎడిబి రహదారిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ౩౦ మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసి బస్ బియ్యంలోడ్ తో వెళ్తున్న వ్యాన్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడ్డ క్షతగాత్రులను పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన పై న్యూ  ఢిల్లీ పర్యటన లో ఉన్న రాష్ట్ర  హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా పోలీస్ అధికారులతో  ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించాలని ఆయన ఆదేశించారు. అలాగే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న ఎడిబి రహదారి పై ప్రత్యేక పోలీస్ బృందాలతో పర్యవేక్షణ చేపట్టాలని హోం మంత్రి ఆదేశించారు. .

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us