Ukraine Crisis : భగ్గుమన్న వంట నూనెల ధరలు.. లీటర్ రూ. 170!

UPDATED 7th MARCH 2022 MONDAY 06:00 AM

Cooking Oil Prices High : నూనె లేని వంటలు ఎక్కడా కనిపించవు. వంటకానికి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్ పడాల్సిందే. ఇది లేదీ రుచి లేదంటారు. కానీ.. ప్రస్తుతం నూనె లేకుండా వంటలు చేయవచ్చా అని అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే వంట నూనెల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

అసలే పెరిగిపోతున్న ధరలతో నూనెల ధరలు కూడా అమాంతం అధికమౌతుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. వంట నూనెల్లో ప్రత్యేకించి పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) నూనె చుక్కలు చూపిస్తోంది.జనవరిలో సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.134 ఉండగా రూ.157కు చేరింది. ఇప్పుడు రిటైల్ లో లీటర్ రూ. 145 గా ఉన్న ధర అమాంతం రూ. 170కి చేరుకుంది.

హోల్ సేల్ లో రూ. 2200 ఉన్న ప్యాక్ రూ. 3000కి చేరుకుంది. దీనికంతటికీ కారణం ఉక్రెయిన్ పై రష్యా చేపడుతున్న యుద్ధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అంతేగాకుండా పంట దిగుబడి తగ్గడం, అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, ఇతరత్రా కారణాలతో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. గత కొన్ని రోజుల కిందట వంట నూనెల ధరలు అదుపులోకి రావడంతో ప్రజలు ఉపశమనం పొందారు. కానీ.. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూనెతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి.

యుద్ధాన్ని సాకుగా చూపి ధరలను పెంచడం ప్రారంభించారు. సన్ ఫ్లవర్ తో పాటు సరఫరా సమస్య లేని ఇతర నూనెల ధరలు కూడా పెంచేస్తున్నారు.గత కొన్ని రోజులుగా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడున్న విమానాశ్రాయాలు, నౌకాశ్రాయాలు, కీలకంగా ఉండే ప్రదేశాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ లోని మూడు నౌకాశ్రయాలపై కూడా రష్యా దాడి చేసి దిగ్భందించడంతో నౌకాయానం పూర్తిగా స్తంభించిపోయింది.

ప్రధానంగా 97 శాతం సన్ ఫ్లవర్ నూనె ఉక్రయిన్ నుంచే దిగుమతి అవుతోందని వెల్లడిస్తున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులు సైతం ధరలు పెంచేశారు. జాతీయస్థాయిలో సగటున పామాయిల్, సోయాబిన్ నూనెల వాడకం ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. చమురు తరహా నూనెల అవసరాల నిమిత్తం భారతదేశం విదేశాలపై ఆధార పడుతున్న సంగతి తెలిసిందే. 67 శాతానికి పైగా విదేశాల నుంచి దిగమతి అవుతోందని అంచనా. ఒకవేళ యుద్ధం ముగిసినా మరో నెలపాటు ధరల పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు.

వరుసగా నూనెల ధరలు పెరుగుతుండటంతో పలువురు వ్యాపారులు స్టాక్‌ను బ్లాక్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న దుకాణాదారులు, వినియోగదారులు అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్‌ దుకాణాల ముందుకు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. మరి వంట నూనెల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us