ఆదిత్యకు ఛాత్ర విశ్వకర్మ జాతీయస్థాయి అవార్డు

UPDATED 21st JANUARY 2019 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విద్యార్థులు జాతీయస్థాయి ఛాత్ర విశ్వకర్మ అవార్డును కైవసం చేసుకున్నట్లు  ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో భావి ఇంజినీర్ల నూతన ఆవిష్కరణలకు పోటీలు నిర్వహిస్తూ జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) ఛాత్ర విశ్వకర్మ అవార్డులతో సత్కరిస్తుందని అన్నారు. సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ విధేయరాజ్ పర్యవేక్షణలో తమ కళాశాలకు చెందిన ఇసిఇ విభాగం విద్యార్థులు రూపొందించిన రైతు నేస్తం స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పేరిట ఆవిష్కరించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొంది నిష్ణాతులైన అధ్యాపకుల ప్రశంసలు పొందడమే కాకుండా, జాతీయస్థాయికి ఎంపికైన విషయం తెలిసిందే. దేశంలో గల ప్రతిష్టాత్మకమైన కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు రూపొందించిన ప్రోజెక్టులతో పోటీపడిన తమ సంస్థ విద్యార్థులు స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రధమ స్థానంలో నిలిచి జాతీయస్థాయిలో సైతం సత్తా చాటి ప్రధమ బహుమతి కైవసం చేసుకొన్నారని, ఈనెల 21వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారని అన్నారు. ఈ సందర్బంగా విభాగాధికారిణి జి. శ్రీదేవి, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ విధేయరాజ్, విద్యార్థులు గాయత్రి హరిప్రియ, శ్రావణి, దీవెన, నిధిశ్రీ, టెక్నిషియన్ విన్నీవిక్టర్ లను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిద విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us