'స్పైడర్'లో ప్రిన్స్ కొత్త లుక్!

UPDATED 27th JULY 2017 THURSDAY 9:30 PM

చాలాకాలం తర్మాత మహేష్‌బాబు 'స్పైడర్' బయటకువచ్చింది. ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు ప్రిన్స్ లేటెస్ట్ పిక్స్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ పాట మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆగస్టు ఒకటి నుంచి రొమేనియాలో మహేష్-రకుల్‌పై ఈ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇక తెలుగు, తమిళంలో బిజినెస్ ఊహించిన దానికంటే జరగడంతో మేకర్స్ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. మూవీ రిలీజ్ వరకు ఈ చిత్రానికి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ చేయాలనే ఆలోచన వున్నారు. దీనివల్ల ప్రమోషన్ రావడమేకాదు, ఓపెనింగ్ అదిరిపోయే రేంజ్‌లోఉండవచ్చని లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us