ప్రగతిలో జాతీయస్థాయి సాంకేతిక సదస్సు స్ట్రిడ్స్ 2కె18

UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రిడ్స్ 2కె18 లో భాగంగా సివిల్ విభాగం ఎలేవేర్ 2కె18, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ విభాగం ఎక్సుల్ట్ 2కె18 పేరిట శుక్రవారం జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పి.వి.బి. రాధాకృష్ణ (సూపరింటెండెంట్ (రిటైర్డ్) ఎ.పి.పోర్ట్స్, కాకినాడ), యు.ఆర్.వి. రమణారావు (చీఫ్ మేనేజర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) హాజరయ్యారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా స్ట్రిడ్స్ 2కె18 సావనీరును ముఖ్య అతిధులతో కలిసి కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ భావి ఇంజనీర్లకు అవసరమైన అన్ని అవకాశాలను కళాశాల అందిస్తోందని, నూతన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, నూతన ఆలోచనలు ఆవిష్కరణకు ఇటువంటి సాంకేతిక సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి. శివరామకృష్ణ మాట్లాడుతూ ఎలేవేర్ 2కె18లో పాల్గొన్న వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి 25 పేపర్ ప్రెజంటేషన్లు, 25 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, 12 మోడల్ ఎక్స్ పోలు, 24 టెక్నికల్ క్విజ్ లు, వివిధ స్పాట్ ఈవెంట్లు నిర్వహించడం జరిగిందన్నారు. వైస్ ప్రిన్సిపాల్, ట్రిపుల్ఇ విభాగాధిపతి డాక్టర్ కె. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా విద్యార్థులు బాహ్య ప్రపంచంతో కలిసి తమ భావాలను వ్యక్తపరచుకోవచ్చని పేర్కొన్నారు. వీటితో పాటు తమ విభాగంసాధించిన ఘనతలను తెలియచేశారు. ఈ కార్యక్రమానికి మొత్తం వివిధ కళాశాలల నుంచి వివిధ అంశాలలో 378 ఎంట్రీలు వచ్చాయని, అందులో 25 పేపర్ ప్రెజంటేషన్లు, 68 పోస్టర్ ప్రెజంటేషన్లు, 25 ప్రొజెక్ట్ ప్రెజంటేషన్లు, 30 టెక్నికల్ క్విజ్ లు, వివిధ స్పాట్ ఈవెంట్లు నిర్వహించామన్నారు. స్ట్రిడ్స్ 2కె18 కన్వీనర్ బి. సుభాన్ రామ్ జీ ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ వి. మల్లిఖార్జున( అసోసియేట్ ప్రొఫెసర్, వి.ఆర్. సిద్దార్థ కాలేజ్, విజయవాడ), డాక్టర్ బి. కృష్ణారావు,(అసోసియేట్ ప్రొఫెసర్, జెఎన్టీయుకె, కాకినాడ), డాక్టర్ డి. రవికిషోర్( ప్రొఫెసర్, విభాగాధిపతి గైట్ ఇంజనీరింగ్ కాలేజ్), డాక్టర్ కె. వెంకటరెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్ జెఎన్టీయుకె, కాకినాడ) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కృష్ణమహేష్ కుమార్ (ఇంజనీర్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సూరంపాలెం) విశిష్ట అతిధిగా హాజరయ్యారు. పి.వి.ఎస్. మంగేశ్వరి (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్), పి.కృష్ణ చైతన్య (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) స్ట్రిడ్స్ 2కె18 కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us