దుర్గాప్రసాద్ స్కూల్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

UPDATED 17th JUNE 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: కాకినాడ దుర్గాప్రసాద్ స్కూల్ యాజమాన్యం స్థానిక గాంధీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ బ్రాంచిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పట్టణంలో తొలిసారిగా సిబిఎస్ఇ సిలబస్ తో బ్రాంచిని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం, తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఎంఇవో వై. శివరామకృష్ణ, ఎండివో కె. స్వప్న, పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు, సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్సైలు ఎల్. శ్రీనివాస్ నాయక్, ఎస్. లక్ష్మీ కాంతం, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, పాగా శిరీష, స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us