వైయస్ఆర్ ఉచిత పంట బీమా..

* 13,822 మంది రైతులకు రూ.18.31 కోట్లు లబ్ధి

UPDATED 15th DECEMBER 2020 TUESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకం క్రింద జిల్లాలో 26 మండలాల్లో 13,822 మంది రైతులకు 9837 హెక్టార్లు దెబ్బతిన్న పంటలకు రూ.18.31 కోట్లు అందచేస్తునట్లు జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలు, తుఫాన్లుతో రైతులు తమ చేతికొచ్చిన పంటను కోల్పోతున్నారని, అలాంటి సమయంలో వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పధకంతో తమకు ఎంతో భరోసా కలిగిందని పలువురు రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పెదపూడి మండలంలో పలు గ్రామాల రైతులు తమ పంటలను కోతలు కోసి తీసుకొని వచ్చే సమయంలో పుంత రోడ్డు వల్ల సరైన మార్గం లేక చాలా కష్టంగా ఉందని ఉపాధి హామీ పధకం ద్వారా రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ విషయమై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, వ్యవసాయ శాఖ డిడి రామారావు, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్ రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us