సింహాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తొలిపూజకు అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు హాజరుకాలేదు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us