వాహనం ఢీకొట్టి వ్యక్తి మృతి

Updated April 6 Thursday 4.35 pm 
పెద్దాపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం శివారున గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఆనూరు గ్రామానికి చెందిన ద్వారంపూడి వెంకట్రావు(52 ) వాలుతిమ్మాపురం లో ఉన్నరైస్ మిల్లు లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఉదయం ఆరు గంటలకు విధులకు హాజరైయేందుకు ఇంటి నుంచి తన మోటార్ సైకిల్ పై బయలుదేరాడు. సరిగ్గా వాలుతిమ్మాపురం శివారుకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె , కుమారుడు  ఉన్నారు. అలాగే సామర్లకోట పెద్దాపురం ఏడిబి రహదారి లో రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.ఎస్ఐ  వై. సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us