లెనోరాలో కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన

UPDATED 17th APRIL 2018 TUESDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలలో ఇటీవల కాశ్మీర్లో కథువా జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని, ఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కళాశాల వైద్యులు, విద్యార్థులు మంగళవారం కొవ్వొత్తులతో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సంయుక్తంగా ఈ కేసును త్వరితగతిన పరిష్కరించి నేరస్థులను కఠినంగా శిక్షించి భాదిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలనీ, దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం పంపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. దాల్ సింగ్, డైరెక్టర్ పిజి స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us