Modi-Channi : గురుగోవింద్‌ ఎక్కడ పుట్టారో తెలుసా..? చన్నీ “భాయియే” మాటకు మోడీ మార్క్ పంచ్

UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 06:30 PM

Modi-Channi : పంజాబ్ లో ఈ ఆదివారం జరగబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫజికా పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ తురుఫుముక్క ప్రియాంక గాంధీ వాద్రా, సీఎం చరణ్ జీత్ చన్నీ టార్గెట్ గా తనదైన శైలిలో వాడీ వేడి వాగ్బాణాలు వదిలారు. ఇటీవల ప్రియాంక గాంధీ పాల్గొన్న ఓ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చరణ్ జీత్ చన్నీ చేసిన విమర్శలు పంజాబ్ లో బర్నింట్ టాపిక్ అయ్యాయి.

యూపీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన వారి చేతుల్లో పంజాబ్ రాష్ట్రాన్ని పెట్టేది లేదని ఇటీవల చన్నీ అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా పంజాబ్ కోడలు అని చెప్పారు చన్నీ.దీనికి పంజాబ్ ఫజీకా ఎన్నికల ప్రచారంలో కౌంటరిచ్చారు మోదీ.

చన్నీ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టింది వారి బాస్, ఢిల్లీకి చెందిన ప్రియాంక గాంధీ కాదా అని అన్నారు. “కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడో దేశ ప్రజలంతా విన్నారు. ఢిల్లీకి చెందిన కుటుంబం ఆయన బాస్. అక్కడ ఆ మాటలు విని చప్పట్లు కొట్టింది కూడా ఆ కుటుంబానికి చెందిన ఆమే.” అని మోడీ కౌంటరిచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us