బండతో కొట్టి చంపేశారు

UPDATED 18th JUNE 2017 SUNDAY 7:00 PM

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శ్రీరాంనగర్ కు చెందిన ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బండ రాయితో కొట్టి చంపిన ఘటన ఆదివారం సంచలనం కలిగించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంనగర్ లో నివాసముంటున్న పప్పల మంగ (60) అనే మహిళ ఈ హత్యకు గురైనట్లు తెలిపారు. ఆమెను చంపడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనే కోణంలో దర్యాప్తును చేస్తున్నారు. హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలిసులు చెబుతున్నారు. ఈ విషయంపై జగ్గంపేట ఎస్ఐ ఆలీఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us