TS News: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం:సీఎం కేసీఆర్

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల్లో ఫీజుల నియంత్రణ పై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం, ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం 'మన ఊరు-మన బడి' కార్యక్రమం కింద రూ. 1,289 కోట్లు కేటాయించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us