UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 04:20 PM
హిందూపురం: నట సింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారం, సినిమా టీమ్ భేటిపై మాట్లాడారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని కలవబోనని బాలకృష్ణ స్పష్టంచేశారు. జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు చిరంజీవి టీమ్ వెళ్లగా.. సీఎంతో చర్చలకు తనను కూడా ఆహ్వానించారని, కానీ రానని చెప్పినట్లు బాలకృష్ణ వెల్లడించారు. Ads by సినిమాల విషయంలో మాత్రం జగన్‌ని కలిసేదే లేదని, సినిమా బడ్జెట్ కూడా పెంచబోనని బాలయ్య స్పష్టం చేశారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్నా కూడా అఖండ ఘన విజయం సొంతం చేసుకుందని అన్నారు బాలకృష్ణ. ఇక ఈ మీటింగ్‌కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు. సినిమా పరిశ్రమ సమస్యలు పరిష్కారం కోసం చిరంజీవి అధ్యక్షతన మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, ఆర్ నారాయణమూర్తి, ఆలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సీఎంతో భేటీ తర్వాత చర్చలు ఆశాజనకంగా ముగిసినట్లు ప్రకటించారు.