రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు : చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, చివరికి దివ్యాంగుల పట్ల కూడా వివక్ష చూపిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘జగన్‌రెడ్డికి చేతనైతే రూ.3000 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ రూ.5000 చేయాలి. నేను స్కూటర్లు ఇచ్చా.. చేతనైతే కార్లు ఇవ్వు. పెళ్లి కానుకగా లక్ష ఇచ్చా.. చేతనైతే రూ.2 లక్షలివ్వు. అంతేగానీ పథకాల్లో కోతలు కోస్తాం... వేధిస్తాం అంటే ఊరుకునేది లేదు. ఓటీఎస్‌ పేరుతో పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ.. చివరికి కాల్‌మనీ వ్యాపారానికి తెరలేపారు. నా ఇంటికి రిజిస్ట్రేషన్‌ పేరుతో నువ్వు డబ్బులు వసూలు చేయడం ఏంటి?’ అని చంద్రబాబు నిలదీశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us