Sania Mirza: ఆటకు వీడ్కోలు చెబుతా..ఇదే నా చివరి సీజన్: సానియా

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ప్రస్తుత సీజనే 2022 : తనకు చివరిదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా అంతర్జాతీయంగా 68వ ర్యాంక్ లో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్ టైటిళ్లు, మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా సానియా మీర్జా నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ తొలి రౌండ్ లోనే సానియా జోడీ ఓటమిపాలైంది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. “కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ఓటమికి అవి కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్ అని మాత్రం చెప్పగలను. గతేడాది ఆఖర్లోనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. అయితే ఇప్పుడు నా వయస్సు 35. ఈ సీజనను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యూఎస్ ఓపెన్ (జూన్ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. అలానే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రో! సమయం పడుతోంది. మూడేళ్ల కుమారుడిని నాతోపాటు విదేశాలకు తీసుకెళ్లడం కూడానూ రిస్క్ తో కూడుకున్నదే” అని పేర్కొంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us