పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణం

UPDATED 26th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సెర్ప్ మహిళా సాధికారత, శిశుసంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మఠం సెంటరులో రూ.16.5 లక్షలు గుడా నిధులతో ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి పనులు, రైల్వే స్టేషన్ సెంటరులో రూ.15 లక్షలు గుడా నిధులతో చేపట్టిన గడియారం స్తంభం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, గుడా చైర్ పర్సన్ గన్ని కృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ నూతన ఆకర్షణలతో సామర్లకోట పట్టణం మరింత సుందరంగా మారనుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడా వైస్ చైర్మన్ డాక్టర్ ఆర్. అమరేంద్రకుమార్, పెద్దాపురం ఏఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఎల్. శివకుమార్, సామర్లకోట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, సామర్లకోట ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, బడుగు శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us