దివిలి కిట్స్ లో సినీ హీరో తరుణ్ సందడి

UPDATED 1st FEBRUARY 2018 THURSDAY 6:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ సినీ హీరో తరుణ్ గురువారం సందడి చేశారు. ఇది నా లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ లో భాగంగా కాలేజ్ కి వచ్చిన ఆయనకు యాజమాన్యం,  విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ మాట్లాడుతూ చాలా కాలం తరువాత నటించిన ఇది నా లవ్ స్టోరీ మూవీ మంచి కధాంశంతో నిర్మించిన పూర్తి  ప్రేమకథా చిత్రమని, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల కాబోయే ఈ మూవీని విజయవంతం చేయాలన్నారు. అనంతరం తరుణ్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us