నంద‌మూరి హీరో సినిమా టీంతో క‌లిసిన కాజ‌ల్

UPDATED 3rd JULY 2017 MONDAY 5:00 AM

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇటు నటుడిగానే కాదు నిర్మాత‌గాను స‌క్సెస్ రూట్ లో వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ‌కుశ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న‌ క‌ళ్యాణ్ రామ్, ఎంఎల్ ఏ (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ ఈ రోజు నుండి హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. చిత్ర హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా టీంతో క‌లిసింది. ఈ విష‌యాన్ని ఫోటోస్ షేర్ చేస్తూ తెలిపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us