తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి

పార్ల్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. రాహుల్ 12, శిఖర్ ధావన్ 79, కోహ్లీ 51, శార్దూల్ ఠాగూర్ 50 (నాటౌట్), రిషబ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్వర్ అయ్యర్ 2, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకు అవుటయ్యారు. అంతకుముందు సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డస్సెన్ 129, టెంబా బవుమా 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక తదుపరి మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా టీమిండియా గెలుస్తుందోమో చూడాలి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us