నూకాలమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 4th APRIL 2018 WEDNESDAY 6:00 PM

కాండ్రకోట (పెద్దాపురం): నూకాలమ్మ హుండీ ఆదాయాన్ని దేవస్థానం అధికారులు బుధవారం లెక్కించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించడం జరిగిందని ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి తెలిపారు. హుండీల ద్వారా 25 రోజులకు గాను రూ.12,08878 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇనస్పెక్టర్ సతీష్ కుమార్, దేవస్థానం చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మీ నాని, ధర్మక్తల మండలి సభ్యులు సావిటి నాగేశ్వరరావు, రంగనాథం శ్రీను, సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సిబ్బంది పుర్రె అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us