గ్రాండ్ గా డీజే ట్రైల‌ర్ లాంచ్

UPDATED 4th JUNE 2017 SUNDAY 10:00 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- క్రేజీ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం దువ్వాడ జ‌గన్నాథ‌మ్. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన సాంగ్ ఫ్యాన్స్ లో బ‌జ్ క్రియేట్ చేస్తుంది. జూన్ 23న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర ట్రైల‌ర్ ని రేపు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక‌ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 12న హైద‌రాబాద్ లో జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీవెంక‌టేశ్వ‌ర బేన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us