ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్ హరికిరణ్

మండపేట (రెడ్ బీ న్యూస్) 13 నవంబర్ 2021: ఖరీఫ్‌ సీజనులో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని 1,082 రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. ఏడిద ఆర్బీకే వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ కీర్తి చేకూరి, ఆర్డీవో సింధూ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సీజన్‌లో 10 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలనేది లక్ష్యమనీ.. ఇందుకు అవసరమైన గోనె సంచులు ఆర్బీకేల పరిధిలో ఉంచుతామన్నారు. గోదామును కూడా ఆర్బీకే కేంద్రమే నిర్వహిస్తుందని.. గోనె సంచులు తీసుకున్నందుకు మిల్లర్లకు యూజర్‌ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. హమాలీల కూలీ క్వింటాకు రూ.25గా నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం తేమ శాతాన్ని ఆర్బీకేలో పరిశీలించి, ఎప్పుడు తీసుకు రావాలనే వివరాలతో కూపన్లు అందజేయనున్నట్లు చెప్పారు. అధిక వర్షాల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు బీమా, పెట్టుబడి రాయితీ అందిస్తామని చెప్పారు. రంగు మారిన ధాన్యం విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం ఏడిదకు చెందిన వైట్ల మోహన్‌రావు పండించిన ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు కూపన్‌ అందజేశారు. జేడీఏ ఎన్‌.విజయ్‌కుమార్, పౌర సరఫరాలశాఖ డీఎం లక్ష్మీరెడ్డి, డీఎస్వో పి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us