పూరిగుడిసె దగ్ధం : మూడు లక్షల ఆస్తి నష్టం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 అక్టోబర్ 2021: మండలంలోని లక్కొండలో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక పూరిగుడిసె దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.మూడు లక్షల ఆస్తినష్టం సంభవించింది. లక్కొండకు చెందిన ఏలుగుల జ్యోతికి చెందిన తాటాకు ఇంటికి మధ్యాహ్నా సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో రెండు తులాల బంగారం, ఆహార సామాగ్రి బట్టలు పూర్తిగా కాలిబూద అయ్యాయి. సంఘటన స్థలాన్ని సచివాలయ కార్యదర్శి రమణ సందర్శించి ప్రమాదానికి గల కారణలపై ప్రాథమిక విచారణ చేపట్టారు. చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఇంటికి నిప్పు పెట్టి నట్లు విచారణలో తేలిందన్నారు. సంఘటనా స్థలాన్ని ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి సందర్శించారు. రెవెన్యూ శాఖ తక్షణ సహాయంగా సమకూర్చిన బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని తహశీల్దార్ శ్రీమన్నారాయణ తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us