జేసీగా సుమిత్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబరు 2021 : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా (ఆర్‌అండ్‌ఆర్‌) సుమిత్‌కుమార్‌ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ (డి) కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ (హెచ్‌) ఎ.భార్గవతేజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ తదితరులు సుమిత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఇంతవరకు శ్రీకాకుళం జేసీగా విధులు నిర్వహించి బదిలీపై జిల్లాకు వచ్చిన సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, కలెక్టరేట్‌ అధికారులు అభినందనలు తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us