గోదావరి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

UPDATED 20th AUGUST 2018 MONDAY 9:00 PM

రంపచోడవరం: గోదావరి పరీవాహక ప్రాంతాలలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీ అవుతున్న నేపధ్యంలో గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఆగష్టు నెలలో గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరికను జారీచేసే స్థాయిలో వరద నీటిప్రవాహం ఉందని, గోదావరి తీరం వెంబడి కోనసీమలంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చింతూరు, దేవీపట్నం మండలాలలో కొన్ని గ్రామాలకు రహదారులు తెగడం వల్ల ప్రజలు బయటకు వెళ్లడానికి వీలులేకుండా ఉన్నారని, వారందరికీ ప్రభుత్వపరంగా పునరావాస కేంద్రాలు ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద భాదితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మీదట జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారన్నారు. కొండమొదలు గ్రామంలో శాటిలైట్ ఫోను ఏర్పాటు చేసి సహాయక చర్యలు పివోకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారన్నారు. నాటుపడవలు నదిలో ప్రయాణించకుండా నిలుపుదల చేయాలని ఆదేశించాలన్నారు. ఇంతవరకు వరద భాదితుల సహాయార్ధం ఐటిడిఎ చేపట్టిన సహాయక చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ వివరించారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాతావరణశాఖ హెచ్చరికలు పాత్రికేయులకు చరవాణి ద్వారా వివరించారు. రానున్న రోజులలో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసిందని, ప్రజలు, వారికి సహాయక చర్యలు చేపట్టే ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ వంతల రాజేశ్వరి, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎంఎల్ఏ వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us