పెద్దాపురం మహారాణి సత్రంలో ఎసిబి దాడులు

UPDATED 5th JUNE 2017 MONDAY 11:45 AM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మహారాణి  సత్రంలో ఎసిబి అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చీమలకొండ సాయి ఆదాయానికి మించిన ఆస్తుల కలిగివున్నారని అభియోగాలు రావడంతో ఈ దాడులు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వి. గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సిఐ పివిఎస్ మోహనరావు బృందం పెద్దాపురం ఆయన బంధువుల గృహాల్లో, అలాగే తణుకు బ్యాంకు కాలనీలో నివసిస్తున్న ఇంట్లో ఏకకాలంలో ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో తెలియచేయాల్సి ఉంది. పెద్దాపురంలో ఎసిబి తనిఖీలు నిర్వహించడంతో ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ దాడుల్లో ఎసిబి ఎస్ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us