Tollywood Mega Meeting: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం వెళ్లిన సినీ పెద్దలు వీళ్లే..!

UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 10 :50 AM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. మరి కాసేపట్లో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై కీలక చర్చలు చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ.. చిరంజీవితో పాటు.. మరికొందరు పెద్దలు, ప్రముఖులకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. కాసేపటి క్రితమే.. బేగంపేట నుంచి ప్రత్యేక విమానం గన్నవరానికి బయల్దేరింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి.. ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి బయల్దేరిన వారిలో ఉన్నారు. మరోవైపు.. ఇప్పటికే విజయవాడలో పోసాని కృష్ణమురళి, మరికొందరు.. ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

చిరంజీవితో కలిసి.. సీనియర్ హీరో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అలీ, నారాయణమూర్తి తదితరులు కూడా గన్నవరం వెళ్తారని.. సీఎంతో సమావేశానికి హాజరవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ.. నాగార్జున స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా బయల్దేరలేకపోయారు. మిగిలిన ప్రముఖులు మాత్రం బేగంపేట విమానాశ్రయంలో కనిపించలేదు. వీరిలో కొందరు ఇప్పటికే.. ఏపీ సీఎం కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సమావేశానికి సంబంధించిన వివరాలను అడిగారు. స్పందించిన చిరంజీవి.. ఇవాల్టితో టాలీవుడ్ సమస్యలకు ఎండ్ కార్డ్ కాదని.. శుభం కార్డు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భేటీకి తనతో పాటు ఎవరెవరు వస్తున్నారో తెలియదని.. అదంతా ఏపీ సీఎంవోకు మాత్రమే తెలుసునని స్పష్టం చేశారు. సమావేశం వివరాలను ఏపీ సీఎంవో కార్యాలయం దగ్గర మీడియాకు వివరిస్తానని చెప్పారు చిరంజీవి.ఇక.. ఏపీ సీఎం జగన్ తో.. చిరంజీవి బృందం సమావేశంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తమ కుంటుబం నుంచి చిరంజీవి వెళ్తున్నారని అన్నారు. తమ వాదనను చిరంజీవి.. సీఎంకు వివరిస్తారని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. అల్లు అరవింద్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us