Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో బన్నీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

UPDATED 7th MAY 2022 SATURDAY 07:00 PM

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ప్రస్తుతం యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.గతంలో ఆయన తెరకెక్కించిన ‘గీతా గోవిందం’ సినిమా కథను తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని చూశాడట. కానీ బన్నీ, ఈ కథ తనకు సూట్ కాదని చెప్పడంతో పరశురామ్ ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా వస్తున్న సర్కారు వారి పాట కూడా బన్నీ కోసమే రాసుకున్న కథగా సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో, ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

సర్కారు వారి పాట చిత్ర కథను కేవలం మహేష్ బాబు కోసమే రాసుకున్నానని.. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మరే ఇతర హీరో కూడా సెట్ కాడని ఆయన చెప్పుకొచ్చాడు.దీంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బన్నీ కోసం రాసుకున్నట్లుగా వస్తున్న వార్తలకు దర్శకుడు చెక్ పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక మే 7న సాయంత్రం 6 గంటల నుండి యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us