RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

REDBEENEWS

ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు విస్తృత స్థాయిలో ప్రమోషన్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా వారి అభిమానులు సినిమా వాయిదా వేయడంతో నిరాశకు లోనయ్యారు.అప్పుడు సినిమా వాయిదా సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల చేస్తామని మాత్రమే చెప్పారు. ఆర్ఆర్ఆర్ దారిలోనే సంక్రాంతికి రావాల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా వేసుకోగా ఫిబ్రవరి జాబితా కూడా వాయిదా తప్పని పరిస్థితి నెలకొంది. అయితే.. ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఆలోచన చేస్తుండగా కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 29నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏప్రిల్ నెలాఖరుకి ఇంకా వంద రోజుల సమయం ఉంది. ఈలోగా కరోనా పరిస్థితులు చక్కబడుతుందని సినీ సర్కిల్స్ అంచనా వేస్తుండగా.. దాదాపుగా అదే ఖరారు కావచ్చనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ డేట్ వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక క్లారిటీ కూడా రాగా.. చరణ్-తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us