రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం

UPDATED 25th MARCH 2018 SUNDAY 6:00 PM

పెద్దాపురం: రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి విభాగంలో ఏర్పాటు చేసిన ఇ.ఐ కేంద్రాన్నిఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నారని అన్నారు. పెద్దాపురంలో 50 పడకల ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మించడానికి రూ.7.50 కోట్లు నాబార్డ్ నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీనిని నిర్మించడానికి అవసమైన స్థలాన్ని సిద్ధం చేయాలని ఆసుపత్రి సూపరెంటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. అలాగే సామర్లకోట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలుగా నిర్మించడానికి రూ. మూడు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని, కాకినాడ, రాజమహేంద్రవరంలలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో కాకినాడలో మాత్రమే కేన్సర్ ఆసుపత్రి ఉందని, హైదరాబాద్ లో ఉన్నట్లే విజయవాడలో బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ విభాగాన్ని గుంటూరులో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెద్దాపురం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. . అనంతరం ఇ.ఐ కేంద్రంలో కంటి పరీక్షలు చేయించుకున్న పేదలకు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, శాప్ వైస్ చైర్మన్ నల్లపరాజు బంగార్రాజు, ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, ఆసుపత్రి  సూపరెంటెండెంట్ డాక్టర్ రవికాంత్, ఆప్తాల్మిక్ ఆఫీసర్స్ బి.సుబ్బారావు, బి.భారతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావులపర్తి విజయ్, గాలి లక్ష్మి, కౌన్సిలర్లు, వైద్యులు డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ సుదీప్తి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us