యోగాతో శారీరక, మానసిక వికాసం సాధ్యం

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

పెద్దాపురం: యోగాతోనే శారీరక, మానసిక వికాసం సాధ్యమని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ వెంకట రామారావు హాజరై మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి కారణంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు నిత్యం యోగా సాధన చేయాలని అన్నారు. యోగా అనాదిగా భారతీయ ప్రజల జీవన విధానంలో ఇమిడి పోయిందని, యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత ఏర్పడి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచానికి దేశం ఇచ్చిన బహుమతి యోగా అని, ఆధునిక జీవనశైలి ప్రభావంతో మనిషి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, దాని నుంచి విముక్తి పొందటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రశాంత జీవనం సాగించాలంటే రోజూ గంటపాటు యోగా చేయాలని, ఔషధాలు లేకుండా సహజసిద్ధంగా శరీరాన్ని శక్తివంతంగా చేసుకునే సాధనం యోగా అని తెలిపారు. యోగా, ధ్యానంతో సమస్యలన్నీ తొలగిపోయి ఒత్తిడి కూడా తగ్గుతుందని అందుకే తమ విద్యా సంస్థల విద్యార్థులతో యోగాసనాలు చేయిస్తుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ యోగా శిక్షకులు కె. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సివోవో, లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ఇండియానా స్టేట్ యూనివర్సిటీ (అమెరికా) ప్రొఫెసర్ జార్జియాన్ డ్వార్ట్, ఎన్.సి.సి ఆఫీసర్ ఎం. సతీష్, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us