కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే మా ఇంటికి రండి: ఎమ్మెల్యే పద్మావతిJan

అనంతపురం (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌పై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు... బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. తాను రెండు రోజులు కనిపించకపోతేనే తన నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నట్లు ఉన్నారని ఛలోక్తి విసిరారు. ఈ నెల 16న తన భర్త సాంబశివారెడ్డికి కోవిడ్ సోకిందని, కావున తామంతా క్వారంటైన్‌లో ఉన్నామని ఎమ్మెల్యే పద్మావతి వివరణ ఇచ్చారు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గుంజేపల్లి గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఎవరి కులం వారికి గొప్పదని, గుంజేపల్లిలో కొందరు కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా రూల్ బుక్ ప్రకారమే తాను వెళ్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తాను కనిపించడం లేదంటూ వైరల్ చేస్తున్న పోస్టర్ వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలియదని, వారి ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదని చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us