ఘనంగా సాయిబాబా ప్రథమ వార్షికోత్సవ పూజలు

UPDATED 22nd DECEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక కోట్లమ్మ చెరువు వద్ద గల స్వయంభూ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో గత సంవత్సరం పెద్దాపురం పట్టణానికి చెందిన  శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ మట్టే శ్రీనివాసరావు, విద్యుల్లత దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్టించిన ఆరు అడుగుల సాయిబాబా ప్రథమ వార్షికోత్సవ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా దాతలు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు నిర్వహించారు. దానిలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఆలయంలో సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. అలాగే మారేడు దళాలతో అష్టోత్తర శత నామావళి పూజలు, అనంతరం ప్రత్యేక భజన కార్యక్రమాన్ని కొనసాగించారు. అలాగే వార్షికోత్సవంలో భాగంగా మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు రాత్రి 9 గంటల వరకు సాయిబాబా వారి ప్రత్యేక భజనలు, కీర్తనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కాపుగంటి పైడిరత్నం, ఆలయ ధర్మకర్తలు క్షత్రి సీతారాం సింగ్, క్షత్రి రాజారాం సింగ్, క్షత్రి మాతాసింగ్ లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us