గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

* జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా

UPDATED 26th APRIL 2022 TUESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్) : వాతావరణం అనుకూలంగా ఉన్నందున లేఅవుట్ వారీగా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం గృహ  నిర్మాణాలు వేగవంతం చేయాలని నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులను కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి లేఅవుట్ల వారీగా లెవెలింగ్, మౌలిక సదుపాయాల కల్పన,  గ్రౌండింగ్, అంతర్గత రహదారులు, కల్వర్టుల నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, ఆర్.డబ్యు.ఎస్, పంచాయతీరాజ్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి పెద్ద లేఅవుట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధిక సంఖ్యలో ఇళ్ళు గ్రౌండింగ్ పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. వాతావరణ అనుకూలతను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా  అందుబాటులో ఇసుక, సిమెంట్, ఐరన్ తో పాటు శాశ్వత ప్రాతిపదికన విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించాలన్నారు. అంతర్గత రహదారులు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు  ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ బి. సుధాకర్ పట్నాయక్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ సీహెచ్ నరసింహారావు, కుడా వీసీ కె. సుబ్బారావు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు డి. సునీత, ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, కెఎస్ఈజేడ్ డిప్యూటీ కలెక్టర్ కె. మనోరమ, బీసీ వెల్ఫేర్ అధికారిణి కె. మయూరి, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బి. వెంకటరమణ, జె. సీతారామారావు, హౌసింగ్, పంచాయతీరాజ్, ఆర్.డబ్యు.ఎస్, ట్రాన్స్ కో, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us