UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 08:50 AM
ముచ్చింతల్: ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శనివారం 11వ రోజు యదావిధిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 261 అడుగుల సువర్ణ సమతామూర్తిని, యాగశాలలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలో సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. ప్రముఖులే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. 2021, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం సమతామూర్తి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మెగాస్టార్ చిరంజీవి దర్శించుకోనున్నారు.
ఇక శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి… అల్లు అర్జున్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం 3డీ షోను తిలకించి.. బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామిజీ అల్లు అర్జున్‌కు మంగళా శాసనాలు అందించారు. సమతామూర్తి కేంద్రానికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు బన్నీ.