టీడీపీ ఇచ్చిన రెండు వేల పెన్షన్‌‌‌‌‌‌‌కు కేవలం రూ.250 మాత్రమే పెంచారు

* ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

UPDATED 3rd SEPTEMBER 2021 FRIDAY 2:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రెండువేల రూపాయల పెన్షన్‌‌‌‌‌‌‌కు కేవలం రూ.250 మాత్రమే పెంచారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మూడు సంవత్సరాలు  గడుస్తున్నా పెన్షన్లు పెంచకపోగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే నెపంతో రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల పెన్షన్లు పైగా తొలగించడం అన్యాయమని అన్నారు. గతంలో మాదిరిగానే పెన్షన్ తీసుకునేందుకు మూడు నెలల అవకాశం ఇవ్వాలని, పెన్షన్‌‌‌‌‌‌‌ను మూడు వేలకు పెంచుతామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us