కోకాకోలాలో తోక పురుగులు

Updated 14th April 2017 Friday 7:20 AM

 పెద్దాపురం : దాహం తీర్చుకునేందుకు డ్రింక్ తాగుదామనుకున్న ఒక వ్యక్తి కి చేదు అనుభవం ఎదురైంది. తాను తాగబోయే డ్రింక్ లో తోక పురుగులు ఉండడం గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే  పెద్దాపురం సామర్లకోట ఎడిబి రహదారిలో ఓ పాన్ షాప్ వద్ద డ్రింక్ తాగుదామని ఒక వ్యక్తి కోకాకోలా డ్రింక్ ను కొనుగోలు చేసాడు. ఆ డ్రింక్ తాగేముందు ఆ సీసాను  పరిశీలించాడు. ఆ సీసాలో పెద్ద పెద్ద తోక పురుగులు కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యాడు. ఓ వైపు సోషల్ మీడియాలో కూల్ డ్రింకులు తాగొద్దంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రచారం చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు  ప్రత్యక్షం గా చూశాకా కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదమో ఈ సంఘటన చూస్తే తెలుస్తోంది.   

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us