ఆదిత్యలో ముగిసిన అధ్యాపక అభివృద్ధి శిక్షణ

UPDATED 10th JUNE 2018 SUNDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఇ.సి.ఇ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు Machine Learning and Evolutionary Computing అనే అంశంపై నిర్వహించిన అధ్యాపక అభివృద్ధి శిక్షణా కార్యక్రమం ఘనంగా ముగిసింది. సివిల్, ఈఈఈ, మెకానికల్, ఇ సిఇ, సిఎస్ఇ, ఐటి విభాగాలకు చెందిన అధ్యాపక బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి హైదరాబాదుకు చెందిన గోకరాజు & రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఇసిఇ ప్రొఫెసర్ డాక్టర్ కె. మీనాక్షి ముఖ్య రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతర విద్యార్థుల వలే ప్రతీ అంశం, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను ఉత్తమ అధ్యాపకులు నిరంతరం ఆచరణ ద్వారా చూపుతారని అన్నారు. విద్యార్థికి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువు చెప్పాలని, నవ సమాజ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం డాక్టర్ మీనాక్షిని జ్ఞాపికతో ఘనంగా సత్కరించి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపక సిబ్బందికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us