అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి!

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు ఇది గుడ్‌న్యూసే. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవచ్చు. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్‌వర్క్ అఫిర్మ్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.


ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయమని, అంతర్గతంగా ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది.

 

 

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us