Parrot Steals GoPro: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక, అద్భుతమైన వీడియో రికార్డ్

Parrot Steals GoPro: కుటుంబ సభ్యులతో కలిసి కొండ ప్రాంతాల్లో పర్యటన వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ప్రకృతి అందాలను, పక్షులను ఆ వ్యక్తి వీడియో కెమెరాలో బందిస్తుండగా.. అక్కడే ఉన్న ఒక చిలుక.. ఆ కెమెరాను నోటకరుచుకుని అమాంతం గాల్లోకి ఎగిరిపోయింది. ఈ ఘటన న్యూజీలాండ్ లో చోటుచేసుకుంది. అలెక్స్ వెర్‌హ్యూల్ అనే వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి ఇటీవల న్యూజీలాండ్ లోని ఆగ్నేయ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళాడు. అక్కడి ఒక హోటల్ లో బసకు దిగిన అలెక్స్..స్థానికంగా ఉన్న కొండ ప్రాంతాన్ని, కొండ జాతి పక్షులను.. వీడియో(GoPro) తీస్తున్నాడు.

హోటల్ బాల్కనీలో పిట్టగోడపై కొన్ని పక్షులను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక పక్షి (Kea Parrot) ఒక్కసారిగా అలెక్స్ చేతిలో ఉన్న గోప్రో (Camera)ను నోటకరుచుకుని..అమాంతం గాల్లోకి ఎగిరిపోయింది. పక్షి కెమెరాను ఎత్తుకెళ్తున్న సమయంలో వీడియో రికార్డు అవుతూనే ఉంది. క్షణపాటు కాలంలో జరిగిన ఈ ఘటన నుంచి తేరుకున్న అలెక్స్.. తన కొడుకుతో కలిసి, పక్షి వాలిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ మరికొన్ని పక్షులు కూడా ఉన్నాయి. ముళ్ల పొదల మాటున కెమెరాను గుర్తించిన అలెక్స్ కుమారుడు..అందులో రికార్డు అయిన వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. పక్షి గాల్లోకి ఎగిరి, కింద వాలిన సమయానికి ఆ కెమెరాలో రికార్డు అయిన దృశ్యం అద్భుతంగా ఉంది.

పక్షి ఎగురుతూ.. చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని రికార్డు చేయడం మధురానుభూతి ఇచ్చిందంటూ అలెక్స్ చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను అలెక్స్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా.. 3 లక్షల మందికి పైగా వీక్షించారు. న్యూజిలాండ్ కొండ ప్రాంతాల్లో నివసించే Kea జాతికి చెందిన ఈ చిలుకలు ఇప్పుడు అంతరించి పోయే దశలో ఉన్నాయి. దీంతో ఆ పక్షుల సంరక్షణకు ప్రభుత్వం, వన్యప్రాణీ సంరక్షకులు కృషిచేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us