బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని సద్వినియోగం చేసుకోండి : జిల్లా మేనేజర్ పుల్లకవి శ్రీకాంత్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 19 అక్టోబర్ 2021: బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పధకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జిల్లా మేనేజర్ పుల్లకవి శ్రీకాంత్ తెలిపారు. స్థానిక విలేఖరులతో ఆయన మంగళవారం మాట్లాడారు.. బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో క్రెడిట్ సొసైటీలో మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9 వేల మంది క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారన్నారు. బ్రాహ్మణులకు 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 10 కోట్లు రుణాలు మంజూరు చేశామని, అర్హులైన, ఆసక్తి గల బ్రాహ్మణ లబ్ధిదారులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు, వ్యక్తిగత వ్యాపార రుణాలు రూ.రెండు లక్షల వరకు కాకినాడలో ఉన్న బ్రాంచ్ ను నేరుగా సంబంధిత ధ్రువపత్రాలతో సంప్రదించి రుణాలు పొందవచ్చునన్నారు. అలాగే క్రెడిట్ సొసైటీలో సభ్యత్వం రుణాలు, దేవాదాయశాఖలో వేతనంపై పనిచేసే అర్చకులకు నేరుగా గాని, ఆన్ లైన్ ద్వారా గాని తీసుకోవచ్చునని తెలిపారు. అందరికోసం ఒక్కరూ ఒక్కరికోసం అందరూ అనే సహకార నినాదంతో ప్రతి ఒక్క బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఈ సొసైటీ పనిచేస్తుందన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి బ్రాహ్మణుడు ఈ సంస్థలో జీవితకాల సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే అన్నారు. ఒక కులానికి సంబంధించి ఒక సొసైటీ కలిగి ఉండడం, అదీ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉండడం బ్రాహ్మణ కో-అపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క ప్రత్యేకతని పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా సభ్యులు డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వడ్డీ పొందే అవకాశం ఉందన్నారు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ సొసైటీ అందిస్తున్న అద్భుత అవకాశం అని పేర్కొన్నారు. అలాగే, అత్యవసరాలకు, వృత్తి నిపుణులకు, కుటీర పరిశ్రమలకు ఆలంబనగా నిలిచే ఏకైక సంస్థ బ్రాహ్మణ కో-అపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చెప్పారు. ఇటువంటి సంస్థలో సభ్యులుగా చేరి, ఈ సంస్థను అభివృధిపథంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పైబడి ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ సభ్యులుగా చేరడం వలన నాబార్డ్, సిడ్బీ వంటి సంస్థలు మనకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయన్నారు. బ్రాహ్మణులు ఈ సంస్థలో సభ్యులుగా చేరాలని ఆయన కోరారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us