AP News: ఏపీలో ఒక్క రోజే 10 వేలు దాటిన కరోనా కేసులు ... 8 మంది మృతి

అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,985 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us