ఈ నెలలోనే పెళ్ళి పీటలెక్కబోతున్న ప్రియమణి!

UPDATED 6th AUGUST 2017 SUNDAY 9:00 PM

తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ అందాలు వలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన ప్రియమణి ఈ నెల‌లోనే పెళ్లి కూతురు కానుంది. కొద్ది రోజుల క్రితం బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో నిశ్చితార్ధం జరుపుకున్న ఈ అమ్మడు ఆగస్ట్ 23న వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ వివాహం చాలా గ్రాండ్ గా కాకుండా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో సింపుల్ గా జరుపుకోనున్నారట. పెళ్లి తర్వాత మాత్రం స్టార్ హోటల్ లో చాలా గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తారని టాక్. ఇక ప్రియమణి ప్రేమాయణం ఓ డ్యాన్స్ షో ద్వారా సాగింది. ముస్తఫాను తొలిసారిగా ఓ డ్యాన్స్ షోలో కలిసిన ఈ అమ్మడు.. ఆ పరిచయాన్ని ప్రేమగా, ఆ తర్వాత వివాహంగా మార్చుకుంటున్నారు. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత ప్రియమణి వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆశిర్వదించమని కోరింది. అయితే చాలా మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు కొంచెం ఇబ్బంది పెట్టే నెగెటివ్ కామెంట్స్ చేశారట. ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లీం కావడంతో వారి ప్రేమను లవ్-జీహాద్ పేరుతో కామెంట్స్ పెట్టారట. దీంతో ప్రియమణి కాస్త అసహనానికి గురయినట్లు సమాచారం. పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి. మీ కామెంట్లతో చిరాకు వస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాని, వీలైతే ఆశీర్వదించండి కానీ మనసుకు ఇబ్బంది పెట్టే కామెంట్లు రాయకండని కోరింది. ఈ అమ్మడు తెలుగులో నటించిన చివరి చిత్రం మన ఊరి రామాయణం. మంచి కథలతో వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానంటుంది ప్రియమణి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us