సత్యదేవుడి ఉత్తర ద్వార దర్శనం

UPDATED 25th DECEMBER 2020 FRIDAY 7:00 PM

అన్నవరం (రెడ్ బీ న్యూస్): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించి పునీతులయ్యారు. శుక్రవారం వేకువజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగన స్నానమాచరింపజేశారు. అనంతరం గర్భాలయం వెలుపల వివిధ సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై శేషపాన్పుపై శయనించే స్వామిగా సత్యదేవుడిని, ఆయన పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్న దేవేరిగా అమ్మవారిని అలంకరించి వైకుంఠ ఏకాదశి పూజలను ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకస్వాములు నిర్వహించారు. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీ హారతులిచ్చి ఉత్తరద్వార దర్శనం ప్రారంభించారు. తొలుత దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈవో త్రినాథరావు, ట్రస్టీలు స్వామిని దర్శించుకున్నారు. ఉదయం అయిదు గంటలకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం 11 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల కటౌట్‌, పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ స్వామిని దర్శించుకున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us