ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

UPDATED 5th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక అయోధ్య రామాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణను ఉపాధ్యాయులు దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో గురువుల స్థానం ఎంతో గొప్పదని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో శ్రేష్టమైనదని, రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఉపాధ్యాయులతోనే తయారవుతారని, ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో భోధన చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులను గొప్పవారిగా తయారు చేసినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన గుర్తింపు లభిస్తుందని, తల్లి, తండ్రి తరువాత గురువే ప్రత్యక్ష దైవమని, అలాంటి గురువు సద్గుణాలను విద్యార్థులకు అందజేయడానికి నిరంతరం తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us