రుణాలు మంజూరులో బ్యాంకర్లు శ్రద్ద తీసుకోవాలి

UPDATED 27th AUGUST 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ఎస్సీ, బిసి, కాపు కార్పొరేషన్ ద్వారా అందచేస్తున్న రుణాల మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లబ్దిదారులకు రుణాలను త్వరిగతిన అందచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెందిన వివిధ బ్యాంకుల మేనేజర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ బ్యాంకర్లు వివిధ కార్పోరేషన్లు ద్వారా అందించే రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని అన్నారు. బ్యాంకర్లు గత ఏడాది కంటే ఈ ఏడాది బిసి కార్పోరేషన్  ద్వారా తక్కువ బడ్జెట్  రిలీజ్ అయిందని, దీనివల్ల రుణాలు మంజూరు విషయంలో సమస్యగా ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి మంత్రి స్పందించి బిసి కార్పోరేషన్ ఇడితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ సంవత్సరంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లును ఇవ్వడం వల్ల రుణాలు మంజూరులో కొంత మేర బడ్జెట్ తగ్గిందని మంత్రి బ్యాంకర్లకు తెలియచేశారు. ఎస్సీ రుణాలు క్రింద 360 టార్గెట్ కాగా ప్రస్తుతం 160 రుణాలు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా 200 మందికి రుణాలు రిలీజ్ చేయవలసి ఉందని మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు ద్వారా ఆర్థిక వెసులుబాటు  కల్పించడానికి బ్యాంకర్లు ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి తెలిపారు. అనంతరం మున్సిపాల్టీ సమీపంలో రూ.  50 లక్షలతో నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపం పనులను మంత్రి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, బ్యాంక్ మేనేజర్లు సయ్యద్ హుస్సేన్, సాయితేజ, చిక్కాల శ్రీనివాసరావు, జి.వి. రామారావు, జె.వి.శేషగిరి, ఐ. ఫణి ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us